Sunday, June 8, 2025

⚫ మహాశూన్యం - 3 ⚫

              ప్రజాస్వామ్య   భారతదేశం 

             అభివృద్ధి చెందుతున్న దేశం 

             అభివృద్ధి చెందుతున్న దేశం 

             అభివృద్ధి చెందుతున్న దేశం 




ఇదే మాటని నా చిన్నప్పటినుంచి,  అంటే గత 35 సంవత్సరాలుగా ఇదే మాటను వింటున్నా.


నా దేశం అప్పుడు ఎలాగుందో ఇప్పుడూ అలాగే ఉంది. కాకపోతే రోడ్లు విశాలమయ్యాయి బిల్డింగులకి ఎత్తు పెరిగింది అంతే తేడా.  ఆ మోసాలు మారలేదు ఆ లంచాలు మారలేదు నమ్మించి మోసం చేసే వ్యక్తులు మారలేదు.


ఇంకెప్పుడయ్యా ఈ దేశం అభివృధ్ధి చెందేది.


ఎన్నో కష్టాలు పడి గొప్పగా చదువుకున్న ఐఏఎస్ లు, ఐపీఎస్ లేమో జీతాలకు పనిచేస్తున్నారు.  ఏమీ చదువుకోని  జ్ఞానం లేని వాళ్లంతా రాజకీయాలలో చేరి దేశాన్ని పాలిస్తున్నారు. కాదు  ఆడిస్తున్నారు.

 ఇంకెలా అభివృద్ధి చెందుతుంది దేశం. 


అసలు ఎవరయ్యా ఈ వ్యవస్థని తయారు చేసింది.


 మనల్ని పాలించే నాయకుడిగా ఎవరిని అనుమతించాలో తెలుసా, 


చదువులో అన్ని డిగ్రీలు పూర్తి చేసి వాళ్లు కనీసం 5,10 సంవత్సరాలు  మిలిటరీలో సేవలను అందించాలి అలాంటి వారిని అనుమతించాలి దేశ రాజకీయాలలోకి .


వాళ్లకి తెలుస్తుంది వ్యవస్థ విలువ దేశం విలువ.


నా దేశంలో నాణ్యమైన చదివే లేదు ఇక ఎన్ని ఉండి     ఏం లాభం.


ఏ దేశంలో అయితే చదువుని లక్షలు పోసి కొనుక్కుంటామో  ఆ దేశం ఎన్నటికీ  బాగుపడదు.

గవర్నమెంట్ స్కూలు    ➡️     ప్రైవేట్ స్కూలు 


ఏ దేశంలో అయితే ఆరోగ్యాన్ని లక్షలు కోసి కొనుక్కుంటామో ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు. 

గవర్నమెంట్ ఆసుపత్రి   ➡️    ప్రైవేట్ హాస్పిటల్ 


 ఏ దేశంలో అయితే పేదవాళ్ళకి ఉండటానికి ఇల్లు ఉండదో ఆదేశం ఎన్నటికీ బాగుపడదు.

   గుడిసెలు     ➡️     విల్లాలు


ఏ దేశంలో అయితే యువతకి చేసుకోవడానికి సరైన పని ఉండదో ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు.


 ఏ దేశంలో అయితే ఒక వ్యవసాయదారునికి తాను పండించిన పంటకి మద్దతు ధర పలకదో                            ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు.


కార్పొరేట్ వ్యవస్థల వల్ల  చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు  ఎక్కడ నలిగిపోతాయో ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు. 


ఆకలి తీర్చే వ్యవసాయదారునికి వడ్డీ లేని రుణాలు  ఇచ్చి ప్రోత్సహించకుండా,   కోట్ల రూపాయలు అప్పులు చేసి విదేశాలకు పారిపోయే వాళ్లకి నిబంధనలు ఎక్కడ మారవో    ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు. 


తినే ఆహారం కూడా ఎక్కడ కల్తీ అవుతుందో 

ఆ దేశం ఎన్నటికీ బాగుపడదు.


గచ్చిబౌలి,  హైటెక్ సిటీలలో ఉన్న పొరుగు దేశాల మల్టీనేషనల్  సాఫ్ట్వేర్ కంపెనీలను చూసి  అభివృద్ధి అనుకోకూడదు. గల్లీలు, బస్తీలు, ఊర్లు, వాడలు  అభివృద్ధి చెందాయా  అదే అసలైన అభివృద్ధి 

      అలా మారని రోజున ఏ దేశముూ బాగుపడదు.

                   అభివృద్ధి  చెందదు.


                        ✍️ తన్నీరు రమేష్


             🔴  మహాశూన్యం  🔴

 




No comments:

Post a Comment