Wednesday, June 4, 2025

మహాశూన్యం - 2

                 == తెలిసిపోతోంది ==


=వయస్సు మీద పడడం తెలిసిపోతోంది. 

=ఒంట్లో ఒక్కో అవయవం మొరాయించడం తెలిసిపోతోంది.

=మనుషుల్లో మనసుల మధ్య అడ్డుగోడలు తెలిసిపోతోంది.  

=మసకబారుతున్న జ్ఞానం , నింగికెగిసిన విజ్ఞానం తెలిసిపోతోంది.

=మనిషికి మనిషికి మధ్య అసూయ విజృంభిస్తుండడం తెలిసిపోతోంది.

=మనుషులకు దూరంగా పచ్చని ప్రకృతికి దగ్గరగా వెళ్లాలన్న ఆలోచనలు తెలిసిపోతోంది.

=సమాజాన్ని వీడి సమాధిలోకి వెళ్తే బాగుండన్న ఆలోచన తెలిసిపోతుంది.

=మనుషుల్లో కట్టలు తెంచుకుంటున్న కోరికలు తెలిసిపోతోంది. 

=మృగాలు సమాజంలో, అమాయకత్వం  అడవుల్లో  సంచరిస్తుండడం తెలిసిపోతోంది.

=ఇప్పటికీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న కనుల కన్నీరు తెలిసిపోతోంది.

=బంధాలు బాంధవ్యాలు అన్నీ అవసరాల మేరకే అని తెలిసిపోతోంది.

=ఇంకా కరుడు గట్టిన కులం ముసుగు ధరించి పైకి పెద్దమనుషుల్లా చెలామణి   అయ్యే  వాళ్ల గుణం తెలిసిపోతోంది.

=కాలు తగిలితేనే మొక్కే చేయి, కత్తితో  స్వైరవిహారం చేస్తుండడం తెలిసిపోతోంది.

=పక్క వాడి గురించి ఆలోచించే తపన,  అసలు నువ్వు ఎవరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు అని ఆలోచించలేని మొద్దు బారిన మెదడు, అమాయకత్వం తెలిసిపోతుంది.

 =డబ్బుకి లోకం దాసోహం అయినప్పుడు దానినే సృష్టించిన నువ్వు దేనికి బానిసవు అనే ఆలోచనలు తెలిసిపోతోంది.

 =ఏ రంధ్రం నుండి నువ్వు ఈ లోకానికి  వచ్చావో అదే రంధ్రం గురించి నువ్వు పడే  తపన తెలిసిపోతోంది.

=నమ్మిన జనాలని మోసం చేసి నువ్వు కడుతున్న కోటల గుట్టు తెలిసిపోతుంది.


  = ఓరి తుఛ్ఛ  నరుడా చిట్ట  చివరికి నీ బతుకు  ఏం అవబోతుందో  నాకు      తెలిసిపోతోంది 

                                      తెలిసిపోతోంది 

                                            తెలిసిపోతోంది.


                                   ✍️ తన్నీరు రమేష్




                   ⚫ మహాశూన్యం

No comments:

Post a Comment